Home  »  » చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సింగర్‌ మృతి!



ఇటీవలికాలంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు విషాద వార్తలు వినాల్సి వస్తోంది. తాజాగా మరో వార్త ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టేసింది. ప్రముఖ సింగర్‌ హర్మన్‌ సిద్ధు(37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మాన్సా నుంచి తన సొంత గ్రామమైన ఖియాలకు కారులో వస్తుండగా, ఒక ట్రక్‌ను బలంగా ఢీ కొట్టడం వల్ల కారు నుజునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో హర్మన్‌ అక్కడిక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. పంజాబ్‌లో మంచి సింగర్‌గా పేరు తెచ్చుకున్న హర్మన్‌ సిద్ధు మరణం అందర్నీ కలచివేసింది. ముఖ్యంగా మ్యూజిక్‌ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

హర్మన్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. హర్మన్‌ లెక్కకు మించిన స్టేజ్‌ పెర్‌ఫార్మెన్సెస్‌ ఇచ్చారు. బేబే బాపు, బబ్బర్‌ షేర్‌, కోయి చక్కర్‌నై, ముల్తాన్‌ వర్సెస్‌ రష్యా వంటి సాంగ్స్‌తో ఎంతో పాపులర్‌ అయ్యారు హర్మన్‌. 2018లో అతని ఫ్రెండ్స్‌తో కలిసి డ్రగ్స్‌ తీసుకెళ్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాను ఆరేడు నెలలుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నానని హర్మన్‌ ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. తాను వాడే డ్రగ్స్‌ పంజాబ్‌, హర్యానాలలో ఎక్కువ ధరకు అమ్ముతారని, అందుకే ఢల్లీిలో ఒక నైజీరియన్‌ తక్కువ ధరకు డ్రగ్స్‌ తీసుకొచ్చినట్టు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా 37 ఏళ్ళ చిన్న వయసులో హర్మన్‌ ప్రాణాలు కోల్పోవడంతో అతని ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.